అనుకున్నారు కానీ కుదరలేదు

Wednesday,March 06,2019 - 11:02 by Z_CLU

మహేష్ బాబు, సుకుమార్ సినిమా ఆగిపోయింది. ఫ్యాన్స్ కి పెద్ద డిజప్పాయింట్ మెంటే. అయితే ఇలాంటి  డిజప్పాయింట్ మెంట్స్ ఫ్యాస్స్ కి కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఎన్నో, అనౌన్స్ అయి సెట్స్ పైకి రాకముందే ఆగిపోయాయి. డైరెక్టర్ పై నమ్మకంతో సినిమా అనౌన్స్ అయినా, స్టోరీ వరకు వచ్చేసరికి పొంతన కుదరకపోయేసరికి మాట వెనక్కి తీసుకున్నారు హీరోలు.

బన్నీ – లింగు స్వామి : బన్ని ఇమేజ్ కి, స్టామినాకి 100% సూటయ్యే ఫిల్మ్ మేకర్. నిజం చెప్పాలంటే లింగుస్వామి లాంటి ఫిల్మ్ మేకర్ కాంబినేషన్ లో బన్నిని చూసుకోవాలనేది, ఫ్యాన్స్ ఎంతో కాలంగా కంటున్న కల. రీజన్స్ పెద్దగా బయటికి రాలేదు కానీ అనౌన్స్ అయ్యాక ఎంత హడావిడి జరిగిందో, అంతే సైలెంట్ గా సినిమా ఆగిపోయింది.

బన్నీ – విక్రమ్ కుమార్ : ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడు కూడా భారీ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఎంత కన్ఫ్యూజన్ ఉన్న స్టోరీలైన్ అయినా, అంతే క్లాస్ గా ప్రెజెంట్ చేస్తాడు విక్రమ్ కుమార్. ఈ సినిమా ఆగిపోవడానికి రీజన్ పెద్దగా తెలీదుకానీ, అనుకున్నట్టు సినిమా సెట్స్ పైకి  వచ్చి ఉంటే డెఫ్ఫినెట్ గా సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండేది.

 

చిరంజీవి – పూరి జగన్నాథ్ :  మెగాస్టార్ 150 వ సినిమా. జస్ట్ అనౌన్స్ మెంట్ కే అప్పట్లో  సెన్సేషన్ క్రియేట్ అయింది. అయితే అప్పటికే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన అంచనాల వల్ల మెగాస్టార్ అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోయాడు. సెకండాఫ్ అంత ఇంప్రెసివ్ గా లేదన్న రీజన్ తో, తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ ని రీమేక్ చేద్దామని ఫిక్సయి,   వినాయక్ ను డైరెక్టర్ గా ఫిక్స్  చేసుకున్నాడు  చిరు.

 

మహేష్ బాబు – బోయపాటి : రేరెస్ట్ కాంబినేషన్ అనిపించుకునేది. స్క్రిప్ట్ లో  బోయపాటి ఊర మాస్ ఎలిమెంట్స్ రాసుకున్నా, మహేష్ బాబు తో స్క్రీన్ పై ట్రాన్స్ లేట్ అయ్యే టైమ్ కి డెఫ్ఫినెట్ గా అది క్లాస్ సినిమా అయి ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే బోయపాటి, మహేష్ బాబుల కాంబినేషన్ గనక సెట్స్ పైకి వచ్చి ఉంటే, డెఫ్ఫినెట్ గా    డిఫెరెంట్ సినిమాగా నిలిచిపోయి ఉండేది. కానీ జరగలేదు.

రామ్ చరణ్ – కొరటాల : వరసగా ఒక్కో హీరోతో జర్నీ చేస్తున్న కొరటాల, రామ్ చరణ్ తో కూడా సినిమా అనౌన్స్ చేశాడు. కొరటాల సినిమా అంటే మాస్, యాక్షన్, మెసేజ్ ఈ మూడింటితో పాటు సక్సెస్ కూడా గ్యారంటీగా ఉంటుంది. ఈ కాంబో ఆగిపోయినా కాస్తో కూస్తో గ్యాప్ తో మెగాస్టార్ తో కొరటాల సినిమా అనౌన్స్ చేశాడు కాబట్టి, ఫ్యాన్స్ కి లెవెల్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంది.

రాజ్ తరుణ్ – సూర్యప్రతాప్ : ‘కుమారి 21 F’ కాంబో. ఈ సినిమా అనౌస్స్ అయినప్పుడు యూత్ లో న్యాచురల్ గానే వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కొన్నాళ్ళ వరకు ఈ సినిమా సెట్స్ పైకి రావడం గ్యారంటీ అనే న్యూస్ వినిపించినా, ఆ తరవాత సైలెంట్ అయిపోయారు మేకర్స్.

వెంకటేష్ – తేజ : రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సక్సెస్ తరవాత ఇమ్మీడియట్ గా అనౌన్స్ అయిన  సినిమా. తేజ కూడా చాలా రోజులు సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్ లో ఈ సినిమా స్క్రిప్ట్ పై చాలా రోజులు పని చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. సినిమా డ్రాప్ అయింది.

రామ్ – ప్రవీణ్ సత్తారు : రామ్ పోతినేని, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమా కూడా ఆల్మోస్ట్ సెట్స్ పైకి వచ్చినట్టే అనుకున్నారంతా. స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ స్టేజ్ లో ఉందనే వైబ్స్ కూడా గట్టిగానే వినిపించాయి. ఆ తరవాత సడెన్ గా ఇటు రామ్, అటు ప్రవీణ్ సత్తారు ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యేసరికి, ఈ సినిమా ఊసు లేకుండా పోయింది.

బాలకృష్ణ -వినాయక్ : పవర్ ప్యాక్డ్ కాంబినేషన్. సినిమా ఆగిపోవడానికి రీజన్స్ బయటికి రాలేదు కానీ, ఫ్యాన్స్ లో ఇప్పటికీ ఈ కాంబో వర్కవుట్ అయితే అదుర్స్ అనిపించుకోవడం గ్యారంటీ అనే ఫీలింగే ఉంది.