Allu Arjun - బన్నీ లిస్టులో మరో కోలీవుడ్ డైరెక్టర్ ?

Tuesday,January 25,2022 - 03:39 by Z_CLU

Allu Arjun movie with Director Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ లిస్టు లో తాజాగా మరో కోలీవుడ్ డైరెక్టర్ పేరు వినబడుతుంది. రెండేళ్లుగా మురుగదాస్ డైరెక్షన్ లో బన్నీ సినిమా చేయనున్నాడనే న్యూస్ తిరుగుతూనే ఉంది. బన్నీ కాంపౌండ్ నుండి కూడా ఆ ప్రాజెక్ట్ ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా మరో దర్శకుడి పేరు కూడా చక్కర్లు కొడుతుంది. అతనే అట్లీ. తక్కువ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ రేంజ్ కెళ్ళిన అట్లి ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో ఒక హిందీ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవ్వగానే అల్లు అర్జున్ -అట్లీ కాంబో సినిమా ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతానికి బన్నీ కన్ఫర్మ్ చేయాల్సిన నెక్స్ట్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఐకాన్ కూడా ఉంది. ఈ సినిమా ఎప్పటి నుండి ఉంటుంది ? అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే మురుగదాస్ తో ఒకటి , కొరటాలతో మరొకరి లిస్టులో ఉంది. ప్రశాంత్ నీల్ తో కూడా ఓ పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉంది. మరి వీటన్నిటిని పక్కన పెట్టి ‘పుష్ప 2’ తర్వాత అట్లీకి చాన్స్ ఇచ్చి మాస్ సినిమా చేస్తాడా ? చూడాలి.

‘అల వైకుంఠ పురములో’ , ‘పుష్ప’ సక్సెస్ తో బన్నీ మంచి జోష్ లో ఉన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఆచి తూచి అడుగులు వేయాలని భావిస్తున్నాడు. మరి ఈ నేపథ్యంలో ఎవరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందా ? అనేది ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది. కొన్ని రోజుల్లోనే బన్నీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

director atlee