నా పేరు సూర్య ట్రైలర్ - రేపే రిలీజ్

Friday,April 27,2018 - 03:43 by Z_CLU

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘నా పేరు సూర్య’ ఫీవర్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ కంప్లీట్ కాన్సంట్రేషన్ ఈ నెల 29 న హైదరాబాద్ లోని  గచ్చిబౌలి స్టేడియం లో గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ పై ఉంది. ఈ లోపు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఫిల్మ్ మేకర్స్.  రేపు మార్నింగ్ 11 గంటలకు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయనుంది ‘నా పేరు సూర్య’ ట్రైలర్.

ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్, డైలాగ్ ఇంపాక్ట్ ఫ్యాన్స్ లో హై ఎండ్ ఇంపాక్ట్ ని రిజిస్టర్ చేసింది. ఇప్పుడు అవే స్టాండర్డ్స్ తో సరికొత్త ట్రైలర్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, ఈ ట్రైలర్ లో ఎలాంటి ఎలిమెంట్స్ ని రివీల్ చేయనున్నారోనన్న క్యూరియాసిటీ ఆల్రెడీ ఫ్యాన్స్ లో బిగిన్ అయిపోయింది.

అల్లు అర్జున్ ని నెవర్ సీన్ బిఫోర్ గెటప్ లో అగ్రెసివ్ మిలిటరీ మ్యాన్ లా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది.  ఈ సినిమాకి వక్కంతం వంశీ డైరెక్టర్. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది.