మహేష్ బాబుకు దక్కిన అరుదైన గౌరవం

Friday,April 27,2018 - 03:22 by Z_CLU

ఓ వైపు ‘భరత్ అనే నేను’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్. సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన అతి కొద్దిమందికి మాత్రమే చోటు దక్కే టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబుకు చోటు దక్కింది. ఈ విషయాన్ని హ్యాప్పీగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు.

రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన మ్యూజియం అధికారులు, ఇప్పుడు మహేష్ బాబు పేరును అనౌన్స్ చేశారు. ప్రభాస్ తరవాత ఇమ్మీడియట్ గా ఈ మ్యూజియంలో చోటు దక్కించుకున్న టాలీవుడ్ ఫేమస్ పర్సనాలిటీ మహేష్ బాబుదే కావడం విశేషం.

తన యూనిక్ స్టైల్ & చరిష్మా తో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంటున్నాడు మహేష్ బాబు. ఓ వైపు ‘భరత్ అనే నేను’ సక్సెస్, మరోవైపు ఈ అనౌన్స్ మెంట్ తో సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.