జీ సినిమాలు (12th ఫిబ్రవరి)

Thursday,February 11,2021 - 10:10 by Z_CLU

36-Vayasulo-fpc-36-వయసులో-zeecinemalu-696x614-696x614

36 వయసులో

నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
నిర్మాత: సూర్య
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
రిలీజ్ డేట్: 24 జులై, 2020

వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.

______________________________________

హైపర్

నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016

వైజాగ్ లో ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

____________________________________

loukyam-zee-cinemalu-586x276

లౌక్యం

నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముకేష్ రిషి, సంపత్ రిషి, చంద్ర మోహన్, రాహుల్ దేవ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : శ్రీవాస్
ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_____________________________________

Bhageeradha

భగీరథ

నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

______________________________________

నా పేరు సూర్య

నటీనటులు : అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, R. శరత్ కుమార్, జానకి వర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, బోమన్ ఇరాని తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్, జాన్ స్టీవర్ట్ ఏడూరి
డైరెక్టర్ : వక్కంతం వంశీ
ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి, శిరీష లగడపాటి, బన్నీ వాస్
రిలీజ్ డేట్ : 4 మే 2018

సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు కృష్ణంరాజు.

అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..? అసలు సూర్యకు కృష్ణంరాజుకు సంబంధం ఏంటి ? తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.

_______________________________________________

lie-zee-cinemalu-586x276

లై

నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : హను రాఘవపూడి
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017

‘లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.