కిరాక్ పార్టీ 5 రోజుల వసూళ్లు

Wednesday,March 21,2018 - 02:32 by Z_CLU

మొదటి రోజు 6 కోట్ల 18 లక్షల గ్రాస్
2 రోజులకు 10 కోట్ల రూపాయల గ్రాస్
ఇక 3 రోజుల్లో 15 కోట్ల రూపాయల గ్రాస్
తాజాగా 5 రోజుల్లో 19 కోట్ల రూపాయల గ్రాస్

నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హీరోహీరోయిన్లుగా నటించిన కిరాక్ పార్టీ సినిమా వరల్డ్ వైడ్ వసూళ్లు ఇది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. నిన్నటితో ఈ సినిమా 5 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 5 రోజుల్లో కిరాక్ పార్టీకి వరల్డ్ వైడ్ 19 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ఎనౌన్స్ చేశారు.

శరణ్ కొప్పిశెట్టి డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మించాడు. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే సమకూర్చగా, చందు మొండేటి ఈ సినిమాకు డైలాగ్స్ రాశాడు.