ట్రైలర్ తో రానా రెడీ..

Wednesday,June 21,2017 - 02:06 by Z_CLU

రానా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ శుక్రవారం రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఇప్పటికే టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమా పై అంచనాలు పెంచేసిన రానా మరో రెండు రోజుల్లో ట్రైలర్ తో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు. రానా జోగేంద్ర అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా, అనూప్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే టీజర్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ రానా చెప్పిన పవర్ డైలాగ్ అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లో రానా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ మరింత ఆకట్టుకుంటాయంటున్నారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ తో రానా సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొల్పుతాడో చూడాలి.