కొరటాల సినిమా సెట్లోకి మహేష్

Wednesday,June 21,2017 - 03:30 by Z_CLU

శ్రీమంతుడు తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘భరత్ అనే నేను’. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్ లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొందరు నటీ నటులతో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ ఈరోజు నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ చేశారు.

ఈ సినిమాలో మహేష్ ఫస్ట్ టైం ఓ పొలిటికల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దానయ్య నిర్మాతగా రూపొందుతున్నఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.