‘మహర్షి’ లో వేరు... ఇప్పుడు వేరు...

Friday,June 07,2019 - 02:06 by Z_CLU

‘అల్లరోడు’ సినిమా చేస్తే ఒకలా ఉంటుంది.. అదే ఇంకో స్టార్ సినిమాలో క్యారెక్టర్ చేస్తే ఇంకోలా ఉంటుంది. సొంత సినిమా అయితే నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకుంటాడు. అదే స్టార్ హీరో సినిమాకైతే వీలైనంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తాడు. రీసెంట్ గా ‘మహర్షి’ లో చేసిందదే. అలాంటిదే ఇప్పుడు రవితేజ ‘డిస్కోరాజా’ లో చేయబోతున్నాడు… కాకపోతే ఇక్కడ విషయం వేరు…

‘మహర్షి’ సినిమా సూపర్ స్టార్ దే… కానీ అసలు కథ బిగిన్ అయ్యేది రవి తోనే. ఎక్కడా తానో కామెడీ హీరో అనే షేడ్ కూడా కనిపించకుండా కంప్లీట్ గా సింక్ అయిపోయి నటించాడు ఈ క్యారెక్టర్ లో. అయితే రవితేజ ‘డిస్కోరాజా’ లో ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న రోల్ కాకపోవచ్చు.

ఈ క్యారెక్టర్ గురించి ఎక్కడా పెద్దగా ఇన్ఫర్మేషన్ బయటకి రాలేదు కానీ, నిన్నా మిన్నటి వరకు సునీల్ ని అనుకున్న రోల్ నే ఇప్పుడు అల్లరి నరేష్ కి ఆఫర్ చేశారని తెలుస్తుంది. ఎలా చేసినా మ్యాగ్జిమం ఈ కారెక్టర్ కాస్తంత కామిక్ షేడ్స్ లోనే ఉండబోతుందని తెలుస్తుంది.

కామిక్ షేడ్ లో ఉన్న ఎమోషనల్ సీక్వెన్సెస్ లో అల్లరి నరేష్ ప్రవేశించాడంటే స్పెషల్ అనిపించుకోవడం గ్యారంటీ. ఇప్పటి వరకు తను చేసిన ప్రతి స్పెషల్ క్యారెక్టర్ ప్రత్యేకమైనదే. ఇది కూడా అలాగే ఉండబోతుందని ‘డిస్కోరాజా’ చుట్టూ పక్కలా టాక్… చూడాలి మరీ.