బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. ఒకేసారి 2 బ్రేకింగ్స్

Friday,June 07,2019 - 04:13 by Z_CLU

త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ కామన్. సో.. ప్రస్తుతం బన్నీతో చేస్తున్న సినిమాలో కూడా సెకెండ్ హీరోయిన్ ఉంటుందని చాలామంది ఊహించారు. కొన్ని పేర్లు కూడా తెరపైకొచ్చాయి. ఫైనల్ గా బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఫిక్స్ అయింది. ఆమె పేరు నివేత పెతురాజ్.

మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ తమిళ బ్యూటీ. రీసెంట్ గా చిత్రలహరి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఏకంగా బన్నీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సో.. బన్నీ సినిమాకు హీరోయిన్లు ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే. సెకండ్ హీరోయిన్ నివేత పెతురాజ్ అన్నమాట.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్ డేట్ కూడా రిలీజ్ చేసింది హారిక-హాసిని బ్యానర్. బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అక్కినేని హీరో సుశాంత్ ను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గతంలో ఈ మేటర్ గాసిప్. ఇప్పుడది అఫీషియల్ అయింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. దాదాపు నెల రోజుల పాటు ఈ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సినిమాకు సంబంధించిన కీలకమైన ఓ బ్లాక్ ను ఈ షెడ్యూల్ లో పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.