మరో కీలక పాత్రలో అల్లరోడు

Thursday,June 06,2019 - 01:15 by Z_CLU

హీరోగా సరైన విజయం అందుకోలేకపోయిన అల్లరినరేష్.. మహర్షి సినిమాతో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమాలో అల్లరినరేష్ చేసిన రవి పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇకపై హీరోగా నటిస్తూనే, ఇలాంటి స్పెషల్ రోల్స్ కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చాడు అల్లరినరేష్. చెప్పినట్టుగానే మరో కీలక పాత్రకు ఓకే చెప్పాడు

ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో ఓ కీలకపాత్ర కోసం అల్లరినరేష్ ను తీసుకున్నారు. నిజానికి ఈ రోల్ కోసం మొన్నటివరకు సునీల్ పేరును పరిశీలించారు. కానీ అల్లరినరేష్ అయితే మరింత యాప్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

ప్రాజెక్టు ఓకే అయితే, మహర్షి తర్వాత అల్లరోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండో స్పెషల్ రోల్ ఇదే అవుతుంది. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ డైరక్ట్ చేస్తున్నాడు.