మహేష్ బాబు ‘మహర్షి’లో అల్లరి నరేష్ చేస్తున్న రోల్

Thursday,September 06,2018 - 11:06 by Z_CLU

మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ న్యూస్ పాతదే. కానీ ఈ సినిమాలో తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పుకున్నాడు అల్లరి నరేష్. రీసెంట్ గా జరిగిన ఒక  ప్రెస్ మీట్ లో ‘మహర్షి’ సినిమా గురించి పెద్దగా రివీల్ చేయడానికి ఇష్టపడని  అల్లరి నరేష్, ఈ సినిమాలో తన క్యారెక్టర్ ‘గమ్యం’ లో గాలి శీను అంత గొప్పగా ఉంటుందని చెప్పుకున్నాడు.

మహేష్ బాబు గారు, వంశీగారు ఈ క్యారెక్టర్ కి నేనైతేనే కరెక్టని అప్రోచ్ అవ్వడం జరిగిందని చెప్పుకున్న అల్లరి నరేష్, ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పుకున్నాడు. క్యారెక్టర్ బావుంటే ఎవరి సినిమాలో నటించడానికైనా రెడీ అని కూడా ఈ సందర్భంగా చెప్పుకున్నాడు అల్లరి నరేష్.

దిల్ రాజు, PVP తో పాటు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.