మహేష్ బాబు చెప్పింది అక్షరాలా నిజం

Friday,May 03,2019 - 10:03 by Z_CLU

జస్ట్ సినిమాలే కాదు ఈ మధ్య కో-స్టార్స్ సినిమాల ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతున్నాడు వెంకీ. అయితే ఈ హీరో ఏ సినిమా ఈవెంట్ కి అటెండ్ అయినా ఆ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. ఇదే మాటను మహేష్ బాబు కూడా కన్ఫమ్ చేశాడు. గమనిస్తే వెంకీ అటెండ్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.

 

మజిలీ :  సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్టయిందో తెలుసు. ఈ సినిమాకి ప్రత్యేకంగా అటెండ్ అయ్యాడు వెంకటేష్. ‘సినిమా చూశాక చైతుని మీరు మనస్పూర్తిగా హగ్ చేసుకుంటారు…’ అని చెప్పిన మాటకి, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పి చైతుని హగ్ చేసుకున్నాడు వెంకీ. సినిమా రిలీజయ్యాక వెంకీ చెప్పినట్టే జరిగింది.

జెర్సీ: ‘జెర్సీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినప్పుడు ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి’ అని చెప్పాడు. సినిమా అయిపోయాక కూడా నాని అర్జున్ క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అయ్యాడంటే, సినిమా చూశాక మీరు కూడా అలాగే కనెక్ట్ అవుతారు..’ అని చెప్పాడు. అక్షరాలా అదే జరిగింది.

అంటే ఈ వరసలో ‘మహర్షి’ ప్రీ రిలీజ్ కి అటెండ్ అయ్యాడు కాబట్టి ‘మహర్షి’ కూడా సూపర్ హిట్టే అనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అంతెందుకు గతంలో ‘శ్రీమంతుడు’ ప్రీ రిలీజ్ కి కూడా అటెండ్ అయ్యాడు వెంకీ. ఆ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ లెక్కన చూస్తే మహేష్ బాబు చెప్పిన మాట 100% వాస్తవమనిపిస్తుంది.