అనూ ఇమ్మాన్యువెల్ ఇంటర్వ్యూ

Thursday,September 06,2018 - 03:44 by Z_CLU

ఈ నెల 13 న గ్రాండ్ గా రిలీజవుతుంది శైలజా రెడ్డి అల్లుడు సినిమా. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యువెల్, ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తన ఫ్యూచర్ సినిమాల గురించి మీడియాతో షేర్ చేసుకుంది.

అదే నా క్యారెక్టర్…

సినిమాలో చాలా ఇగోయిస్టిక్ అమ్మాయిలా కనిపిస్తాను. కోపం కూడా చాలా ఎక్కువ… రమ్యకృష్ణ గారికి కూతురిలా కనిపిస్తాను ఈ సినిమాలో.

నేను కూడా కొంచెం…

నా రియల్ క్యారెక్టర్ కి సినిమాలో క్యారెక్టర్ కి ఎగ్జాక్ట్ సిమిలారిటీస్ అని చెప్పలేను కానీ, నాకైతే డెఫ్ఫినేట్ గా ఈగో ఉంది. నేనైతే కొద్దో, గొప్పో  ఈగో అందరికీ ఉండాలనే అనుకుంటా.

ఈ సినిమాలో వేరు…

నేను చేసిన సినిమాల్లో ఎక్కడ కూడా నా క్యారెక్టర్ కి పెద్దగా మాట్లాడే స్కోప్ లేదు. కానీ ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. చాలా గట్టిగా మాట్లాడే సిచ్యువేషన్స్ ఉన్నాయి.

చాలెంజ్ ఆక్సెప్ట్ చేశాను…   

సినిమాలో మారుతిగారిచ్చిన ప్రతి సీన్ చాలెంజింగే… నా విషయంలోనే కాదు చైతు విషయంలో కూడా, ట్రైలర్ చూస్తే చైతులో కొత్త బాడీ లాంగ్వేజ్ చూస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది.

అదీ రమ్యకృష్ణ గారు…

 రమ్యకృష్ణ గారంత గ్రేస్ ఫుల్ విమెన్ ని నేను ఇంతవరకు చూడలేదు. మా అందరిలా స్క్రిప్ట్ ముందే చూసుకుని ప్రిపేర్ అవ్వడం లాంటివి కూడా ఉండదు. అప్పటికప్పుడు రెడీ అయిపోతారు. ఆవిడ నా పక్కన ఉంటే అసలేం మాట్లాడాలో మర్చిపోతూ ఉంటా ఒక్కోసారి…

నా క్యారెక్టర్ బ్రీఫ్ గా చెప్పాలంటే…

అందరూ ఈగోయిస్టిక్ లాగే నేను కూడా ఈ సినిమాలో నాకే ప్రిఫరెన్స్ ఇస్తుంటా… ఎవరైనా నా తరవాతే టైప్ లో.. నా రోల్  సినిమాలో చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఎవరినైనా ప్రేమిస్తే అతిగా ప్రేమించేస్తుంది. సినిమాలో తల్లీ కూతుళ్ళ మధ్య రిలేషన్ షిప్ లో డిఫెరెన్సెస్ ఉంటాయి.

రమ్యకృష్ణ చెప్పిన మాట…

రమ్యకృష్ణ గారు పెద్దగా సలహాలు ఇవ్వరు కానీ ఒకసారి హిట్స్, ఫ్లాప్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పారు. హిట్స్ ఫ్లాప్స్ మన చేతుల్లో ఉండవు. మనం చేయాల్సిందల్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే…

ఇప్పుడే తప్పులు చేసేయాలి…

నేనింకా నేర్చుకునే స్టేజ్ లోనే కాబట్టి చేస్తే తప్పులు ఇప్పుడే చేయాలి, ఇప్పుడే నేర్చుకోవాలి. అందుకే నా ఫ్లాప్స్ ని నేనంతగా పట్టించుకోను, నేర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటాను…

ఒక్క సినిమా…

ఒక్కోసారి కొన్నికమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అలాంటి క్యారెక్టర్ చేయడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు… మనం సినిమాలు చేస్తూ పోయే ప్రాసెస్ లో ఒక మంచి సినిమా, మంచి  క్యారెక్టర్ పడితే లైఫ్ చేంజ్ అయిపోతుంది. నేను అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నా…

గీతగోవిందం వదులుకున్నా…

‘నా పేరు సూర్య’ సినిమా చేసే టైమ్ లో ‘గీతగోవిందం’ ఆఫర్ వచ్చింది. అప్పట్లో చేతిలో ఉన్న అవకాశాల్లో ఏవో కొన్ని చూజ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ లో ఆ సినిమా వదులుకున్నా… అప్పుడు డైరెక్టర్ అట్లీస్ట్ కామియో చేయమని అడగడంతో చేశాను. ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా…

ప్రతీది నా నిర్ణయమే…

నేను ఏ సినిమా చేసినా అది నా నిర్ణయమే. ముందు కథ వింటాను. నచ్చితే చేస్తాను లేకపోతే లేదు. కనీసం ఈ విషయాలు మా ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కస్ చేయను.

అందుకే అంత కష్టపడాల్సి వచ్చింది…

నేను పుట్టి పెరిగింది U.S. లోనే కాబట్టి కనీసం హిందీ కూడా రాకపోవడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడటం రాకపోయినా, అర్థమవుతుంది.

హైదరాబాద్ ఇల్లు లాంటిది…

ఇప్పుడు U.S. కి చాలా తక్కువగా వెళ్తున్నా… ప్రస్తుతానికి హైదారాబాదే నాకు ఇల్లు. ఫ్యూచర్ లో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నా…

అప్పుడే తమిళ సినిమా..

తెలుగులో ఎస్టాబ్లిష్ అయ్యాక తమిళ సినిమాల్లో ట్రై చేస్తా.