జనవరి 10 న అఖిల్ నెక్స్ట్ మూవీ డీటేల్స్

Wednesday,December 27,2017 - 06:43 by Z_CLU

అఖిల్ ‘హలో’ మూవీ సూపర్ హిట్టయింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు, ఓవర్ సీస్ లోను సెన్సేషన్  క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమా సక్సెస్ తో స్పీడ్ మీదున్న అఖిల్ జనవరి 10 న, తన నెక్స్ట్ మూవీ డీటేల్స్ ని అనౌన్స్ చేయనున్నాడు.

ఫస్ట్ మూవీ తరవాత ‘హలో’ మూవీని సెట్స్ పైకి తీసుకు రావడానికి చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్, నెక్స్ట్ సినిమాని ఏ మాత్రం లేట్ చేయకుండా సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతానికి ప్రొడ్యూసర్ దగ్గరి నుండి డైరెక్టర్ వరకు చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడు.

హలో తరవాత సెట్స్ పైకి రానున్న అఖిల్ 3 వ సినిమా డైరెక్టర్ దగ్గరి నుండి ప్రొడ్యూసర్ వరకు సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నా, ఈ సినిమాకి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే.