రేపే గ్రాండ్ గా రిలీజ్ కానున్న ‘ఒక్కక్షణం’

Wednesday,December 27,2017 - 07:32 by Z_CLU

V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కింది ‘ఒక్కక్షణం’ మూవీ. అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. లైఫ్ వర్సెస్ డెస్టినీ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది.

‘ప్యారలల్ లైఫ్’ అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, హార్ట్ టచింగ్ ఇమోషనల్స్ తో తెరకెక్కిన ఈ సినిమాని చక్రి చిగురుపాటి నిర్మించాడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.