బోయపాటి దర్శకత్వంలో అఖిల్..?

Tuesday,October 25,2016 - 11:33 by Z_CLU

ఎంత స్ట్రాంగెస్ట్ సినిమా కాంపౌండ్ ఉన్నా స్క్రిప్ట్ విషయంలో చిన్న తేడా వచ్చినా సినిమా ఆడదు. అందుకే మరీ ఇంత లేటా అనిపించినా అఖిల్ మాత్రం కథ, డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోలేదు. ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని కసిగా ఉన్న అఖిల్, రేపో మాపో విక్రమ్ డైరెక్షన్ లో సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు.

akhil-mass

మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న విక్రమ్ డైరెక్షన్ లో అఖిల్ ఎలా కనిపించనున్నాడో ఇంకా తెలీకపోయినా, తన మూడో సినిమా మాత్రం ఊరమాస్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అఖిల్. ప్రస్తుతం బెల్లంకొండ  శ్రీనివాస్ తో సినిమాను తెరకెక్కించాలనుకుంటున్న బోయపాటి, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే అఖిల్ తో సినిమా సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట.