Mr. మజ్ను ఫస్ట్ లుక్- రొమాంటిక్ అఖిల్

Wednesday,September 19,2018 - 04:30 by Z_CLU

అఖిల్ Mr. మజ్ను ఫస్ట్ లుక్ రిలీజయింది. అయితే అన్ని సినిమాల్లోలాగా జస్ట్ ఒక ఇమేజ్ తోనో, మోషన్ పోస్టర్ తోనో సరిపెట్టుకోని ఫిలిమ్ మేకర్స్ 0:49  సెకన్ల వీడియో రిలీజ్ చేసి, సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే క్లారిటీ బిగినింగ్ నుండే ఉన్నా, అఖిల్ ని ఇంత రొమాంటిక్ గా ప్రెజెంట్ చేస్తాడనే గెస్, ఫ్యాన్స్ కూడా చేయలేదు. ‘ఏంటో ఈ ఇంగ్లీష్ భాష, దేన్నయితే మిస్ చేయకూడదో, దాన్నే మిస్ అన్నారు..” అని అఖిల్ చెప్పే డైలాగ్, సినిమాలో అఖిల్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూనే, ఈ సినిమాకి Mr. మజ్ను అని పెట్టిన టైటిల్ ని జస్టిఫై చేస్తుందనిపిస్తుంది.

కొత్త హెయిర్ స్టైల్ తో మరింత ఎనర్జిటిక్ గా కనిస్తున్నాడు అఖిల్ ఈ సినిమాలో.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజర్. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.