1.5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన Mr మజ్ను ఫస్ట్ సింగిల్

Tuesday,December 18,2018 - 10:03 by Z_CLU

యూత్ కి తెగ నచ్చేసింది Mr మజ్ను ఫస్ట్ సింగిల్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తరవాత ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన వైబ్స్, ఈ సింగిల్ తో మరింతగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ లిరికల్  వీడియో ఇప్పటికే 1.5 మిలియన్స్ క్రాస్ చేసింది. అఖిల్ కి ఉన్న క్రేజ్ కి, తమన్ మ్యూజికల్ మ్యాజిక్ తోడై, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘ఏమైనదో..’ సాంగ్.

ఈ సాంగ్ తర్వాత Mr. మజ్ను నుండి వచ్చే నెక్స్ట్ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ కూడా పక్కా ప్లానింగ్ తో సినిమాని ప్రమోట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 25 న రిలీజవుతుంది Mr మజ్ను.