ఇయర్ ఎండ్ స్పెషల్ : టాలీవుడ్ కొత్త హీరోయిన్స్ 2018

Tuesday,December 18,2018 - 11:02 by Z_CLU

ప్రతీ ఏడాది కొందరు కొత్త భామలు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కుర్రకారుని ఫిదా చేస్తూ వరుస సినిమాలు పట్టేస్తుంటారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో పవర్ ఫుల్ డెబ్యూ తో యూత్ ని మెస్మరైజ్ చేసి చక చకా సినిమాలు చేసేస్తున్నారు కొందరు హీరోయిన్లు. మరి తమ డెబ్యూ మూవీతో ఈ ఇయర్ ఆడియన్స్ ని ఫిదా చేసిన కొత్త హీరోయిన్స్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

 

మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కైరా అద్వాని. మొదటి సినిమాతోనే అందరినీ ఎట్రాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న కైరా వెంటనే రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఈ బడా సినిమాలతో ఈ ఇయర్ స్టార్ హీరోయిన్స్ లిస్టు లో చోటు సంపాదించుకుంది.

కన్నడలో ‘కిరిక్ పార్టి’ సినిమాతో పాపులర్ అయిన రష్మికా మండన్న ఈ ఏడాది ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ తో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ మారిపోయింది. ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు.

ఈ ఇయర్ చాలా మంది హీరోయిన్స్ డెబ్యూ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించినా పాయల్ రేంజ్ ఫాలోయింగ్ మాత్రం  అందుకోలేకపోయరనే చెప్పాలి. ‘RX100’ తో ఈ ఏడాది టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ కుర్రకారుని ఫిదా చేసేసింది. గ్లామర్ తోనే కాకుండా తన పెర్ఫార్మెన్స్ తో కూడా మెస్మరైజ్ చేసింది పాయల్. తెలుగులో పాయల్ డెబ్యూ కి పర్ఫెక్ట్ రోల్ దొరికింది. మొదటి  సినిమా ఇచ్చిన ఫ్యాన్ బేస్ తో నెక్స్ట్ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ గోల్డెన్ బ్యూటీ.

లాస్ట్ ఇయర్ ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన అదితి రావు హైదరి ఈ ఏడాది ‘సమ్మోహనం’ సినిమాతో టాలీవుడ్ లో స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకొన్న అదితి  తన పెర్ఫార్మెన్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసేసింది. ఇదే ఏడాది ‘అంతరిక్షం’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకురాబోతుంది ఈ బ్యూటిఫుల్ లేడీ.

 

ఏ హీరోయిన్ కైనా తన డెబ్యూకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే  రోల్ దొరకాలి. అప్పుడే తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది అలాంటి రోల్ తో ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్.   ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో  తన పెర్ఫార్మెన్స్ తో మేజిక్  చేసేసింది. నిజానికి కథలో స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకడం అదీ మొదటి సినిమాకే దొరకడం నభా అదృష్టమే. డెబ్యూ మూవీ ఇచ్చిన ఎనర్జీ తో తెలుగులో మరో రెండు సినిమాలు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్ అంటే పాటలకు , రొమాంటిక్ సీన్స్ కి మాత్రమే అంకితం కాదని తన డెబ్యూ రోల్ తో నిరూపించింది రుహానీ శర్మ. డెబ్యూ అంటే కాస్త గ్లామర్ రోల్ సెలెక్ట్ చేసుకొనే హీరోయిన్స్ కి తను మినహా అని రుజువు చేసింది. ‘చిలసౌ’ సినిమాలో  ఒక్క సీన్ లో కూడా గ్లామర్ గా కనిపించకపోయినప్పటికీ రుహనీ కి కనెక్ట్ కానివారుండరు.

 

సవ్యసాచి సినిమాలో చైతూ సరసన నటించిన నిధి అగర్వాల్ కూడా తన డెబ్యూ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డెబ్యూ సినిమాతోనే అందరినీ ఎట్రాక్ట్ చేసి పాల మీగడ లాంటి సొగసుతో అందాల నిధి అనిపించుకుంది.  ప్రస్తుతం అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్న నిధి మరి కొన్ని సినిమాలు కూడా సైన్ చేసే పనిలో ఉంది.

ఈ ఇయర్ డెబ్యూ మూవీతో సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ లిస్టు లో  ప్లేస్ కొట్టేసింది ప్రియాంక జవల్కర్. విజయ్ దేవరకొండ ‘టాక్సీ వాలా’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ తెలుగమ్మాయి ఫస్ట్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది.

ఈ ఇయర్ డెబ్యూ హీరోయిన్స్ లిస్టు లో శోబిత దూలిపాళ కూడా ఉంది. ‘గూఢచారి’ సినిమాలో ఈ బ్యూటీ కనిపించింది కాసేపే అయినా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్ తో స్పెషల్  గా నిలిచింది. ‘గూఢచారి’ సక్సెస్ లో కీ రోల్ పోషించింది శోభిత.

‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మాళవిక శర్మ. ఈ సినిమాలో రవి తేజ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది.