అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ టీజర్

Tuesday,January 22,2019 - 04:33 by Z_CLU

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మిస్టర్ మజ్ను’ హవా నడుస్తుంది. ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన క్రేజ్ కి తగ్గట్టే ఫిల్మ్ మేకర్స్ కూడా అదే స్థాయిలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ వరసలోనే ఇప్పటికే లిరికల్ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఈ వన్ మినట్ వీడియోలో అఖిల్ అవుట్  స్టాండింగ్ ఎనర్జీని ప్రెజెంట్ చేశారు మేకర్స్.  కొన్ని చోట్ల  ఈ సాంగ్ లిరికల్ వీడియోలో ఉన్న విజువల్స్ నే   మళ్ళీ రిపీట్ చేశారనిపించినా, ఎగ్జాక్ట్ గా సాంగ్ లో ‘మిస్టర్ మజ్ను..’ అనే లిరిక్స్ ఉన్న చోట, అఖిల్  ఎనర్జీ పీక్స్ అనిపిస్తుంది.  ఫ్యాన్స్ కి ఇది డెఫ్ఫినెట్  గా  స్టన్నింగ్ ఎక్స్ పీరియన్సే.

జస్ట్ యూ ట్యూబ్ లో వీడియోకే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉంటే, ఈ సాంగ్ కంప్లీట్ విజువల్స్ కి థియేటర్స్ లో స్టన్నింగ్ రెస్పాన్స్ గ్యారంటీ అనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. తమన్ మ్యూజిక్ కంపోజర్. జనవరి 25 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుందీ మిస్టర్ మజ్ను.