అఖిల్ ‘హలో’ టీజర్ రిలీజ్ డేట్

Tuesday,November 14,2017 - 02:26 by Z_CLU

ఈ రోజు 2 గంటలకు అఖిల్ ‘హలో’ మూవీ టీమ్ నుండి అనౌన్స్ కానున్న సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అని అటు సోషల్ మీడియాతో పాటు, అక్కినేని ఫ్యాన్స్ లో నిన్నటి నుండి క్రియేట్ అయిన సస్పెన్స్ కి తెరపడింది. అల్టిమేట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 ని రిలీజ్ డేట్ గా  ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సినిమా టీజర్ నవంబర్ 16 న రిలీజ్ కానున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఇప్పుడీ న్యూస్ అక్కినేని ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

 

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. అఖిల్ సరసన కళ్యాణి హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.