దిల్ రాజు ప్రొడక్షన్ లో నితిన్ మూవీ

Tuesday,November 14,2017 - 02:04 by Z_CLU

శతమానం భవతి లాంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తరవాత సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకి హీరో ఫిక్సయ్యాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి నితిన్ సంతకం చేయడం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

నితిన్ కరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ లా నిలిచిన సెన్సేషనల్ హిట్ ‘దిల్’ మూవీ తరవాత నితిన్, దిల్ రాజు సినిమాలో  నటించడం న్యాచురల్  గానే పాజిటివ్  వైబ్  ని  క్రియేట్  చేస్తుంది.  అల్టిమేట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.