యూరోప్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసిన అజ్ఞాత వాసి టీమ్

Friday,November 17,2017 - 12:18 by Z_CLU

పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి టీమ్ సక్సెస్ ఫుల్ గా యూరోప్  షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ తో పాటు, సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనుంది.

త్రివిక్రమ్ మార్క్ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే అనిరుధ్ కంపోజ్ చేసిన ‘బయటికొచ్చి చూస్తే’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.