జీ సినిమాలు ( 17th నవంబర్)

Thursday,November 16,2017 - 10:07 by Z_CLU

నేనేం చిన్నపిల్లనా..?

నటీనటులు : రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్

ఇతర నటీనటులు : సంజనా గల్రాణి, శరత్ బాబు, సుమన్, రఘుబాబు, L.B.శ్రీరామ్, కాశీ విశ్వనాథ్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : P. సునీల్ కుమార్ రెడ్డి

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 8 నవంబర్ 2013

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ ఫిలిం ‘నేనేం చిన్నపిల్లనా..’. నిజానికి దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ‘పట్టుదల’ అని డిసైడ్ అయ్యారు. తీరా సినిమా రిలీజ్ కి దగ్గర పడ్డాక ‘నేనేం చిన్నపిల్లనా’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్ హీరో హీరోయిన్ లు గా నటించారు. M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

=============================================================================

చందమామ

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

కథా నాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

=============================================================================

సిద్ధు  ఫ్రమ్  శ్రీకాకుళం 

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

 అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

============================================================================

బాడీగార్డ్

నటీనటులు : వెంకటేష్, త్రిష, సలోని అశ్వని,

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయ ప్రకాష్ రెడ్డి, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : బెల్లం కొండ సురేష్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2012

వెంకటేష్, త్రిష జంటగా నటించిన మోస్ట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాడీగార్డ్. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

బ్రదర్స్

నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : K.V.ఆనంద్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 2012

సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.