రామ్ చరణ్ ‘రంగస్థలం’ లేటెస్ట్ అప్ డేట్

Friday,November 17,2017 - 12:44 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది సుకుమార్ – రామ్ చరణ్ మూవీ. 1985 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ ఎంటర్ టైనర్, ఈ నవంబర్ కల్లా టాకీపార్ట్ కంప్లీట్ చేసుకోవాలనే టార్గెట్ సెట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న రంగస్థలం టీమ్, సినిమాలోని ఇమోషనల్ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది.

రామ్ చరణ్, సమంతా ఫస్ట్ టైమ్ జోడీ కడుతున్న ఈ సినిమా ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోని మేకర్స్, టాకీపార్ట్ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే, మిగిలిన 4 సాంగ్స్ ని డిసెంబర్ ఫస్టాఫ్ లో కంప్లీట్ చేసుకుని సినిమా షూటింగ్  కి  ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.