#Narappa Trailer - వెంకీ మాస్!

Wednesday,July 14,2021 - 02:24 by Z_CLU

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని త్వరలోనే OTT లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 2నిమిషాల నిడివితో విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ హంగామా చేస్తుంది.

విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మాస్ సినిమా చేయకపోవడంతో ‘నారప్ప’ ట్రైలర్ చూసి విక్టరీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సినిమాలో ఉండే మెయిన్ హైలైట్స్ అన్నీ ట్రైలర్ లో చూపించేశారు. “వాళ్ళని ఎదురించడానికి అదొక్కటే దారి కాదు. మన దగ్గర భూముంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువు ఒక్కటి మాత్రం మన దగ్గర నుండి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్పా” అంటూ సినిమా క్లైమాక్స్ లో వెంకటేష్ డైలాగ్ తో చెప్పే సందేశాన్ని కూడా ట్రైలర్ కట్ లో వేశారు. ఇక ట్రైలర్ చూస్తే శ్రీకాంత్ అడ్డాల ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఈ రీమేక్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసినట్టు అర్థమవుతుంది. ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించే ప్రయత్నం చేసినట్టు క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వెంకటేష్ లుక్ కూడా ఆకట్టుకుంది. ప్రియమణి మిగతా పాత్రల తాలూకు సన్నివేశాలు కూడా ట్రైలర్ లో పొందిపరిచారు.

ట్రైలర్ లో వేసిన కొన్ని యాక్షన్ షాట్స్, వెంకటేష్ డైలాగ్ , విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా అసురన్ నేపథ్య సంగీతాన్నే నారప్ప కి కూడా వాడుకోవడం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ కోసమే మణిశర్మ నేపథ్య సంగీతం కాకుండా ఒరిజినల్ ట్రాక్ వాడుకున్నారని అనుకోవచ్చు. ఓవరాల్ గా నారప్పట్రైలర్ తో వెంకటేష్ ఎట్రాక్ట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు. సురేష్ బాబు , కలైపులి థాను సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జులై 20న OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics