వెంకీ ఈసారి కూడా అంతే...

Saturday,October 26,2019 - 09:02 by Z_CLU

విక్టరీ వెంకటేష్ అకౌంట్ లో మరో రీమేక్ చేరనుంది. ధనుష్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ రీమేక్ లో వెంకీ హీరోగా నటించబోతున్నాడు. ఇతర భాషల్లో ఆడియెన్స్ మెచ్చిన సినిమాల్ని తెలుగు ఆడియెన్స్ కోసం ఇలా రీమేక్స్ చేసి మెస్మరైజ్ చేయడం వెంకీకి కొత్తేం కాదు. ఈ వరసలో చాలా సినిమాలు కనిపిస్తాయి.

 

గురు : ఈ సినిమా ఫస్ట్ రిలీజయింది హిందీ, తమిళ భాషల్లో. మాహ్దవన్ హీరో ఈ సినిమాలో. ఈ సినిమా అక్కడ సక్సెస్ అయిందో లేదో, ఇమ్మీడియట్ గా తెలుగులో సినిమాని పట్టాలపైకి తేచ్చేశాడు వెంకీ. డైరెక్టర్ తో సహా ఏ మాత్రం టీమ్ మారకుండానే ‘గురు’ తెలుగులో తెరకెక్కింది. సూపర్ హిట్టయింది.

గోపాల గోపాల : హిందీలో అక్షయ్ కుమార్ నటించాడు ఈ సినిమాలో. ఈ సినిమా విషయానికి వస్తే జస్ట్ సక్సెస్ ఒకటే టాపిక్ కాదు, రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ని కూడా ఈ సినిమా కోసం ఒప్పించుకున్నాడు. వెంకీ కరియర్ లో ఇది డెఫ్ఫినెట్ గా డిఫెరెంట్ సినిమా.

దృశ్యం : ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ బేస్డ్ థ్రిల్లర్. ఫ్యామిలీ కోసం తపించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తిలా కనిపించాడు వెంకీ ఈ సినిమాలో. మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయిన తరవాత ఇంకా ఇతర భాషల్లో కూడా రీమేక్ అయింది.

బాడీగార్డ్ : హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా బాలీవుడ్ లో ఎంత హిట్టయిందో, తెలుగులో కూడా అదే స్థాయి హిట్టందుకుంది. అటు యాక్షన్ సీక్వెన్సెస్ లోను, ఇటు ఎమోషన్ సీన్స్ లోను వెంకీ తన స్టైల్ లో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేశాడు. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వరసలో ఈనాడు, ఘర్షణ లాంటి సూపర్ హిట్స్ మరిన్ని ఉన్నాయి. తెలుగు ఆడియెన్స్ పల్స్ ని పక్కాగా పట్టేసిన వెంకీ, రీమేక్స్ విషయంలో చేసిందల్లా సక్సెస్ అనిపించాడు. అందుకే ఇప్పుడు ఈ ‘అసురన్’ రీమేక్ కూడా అదే స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియెన్స్.