రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'హిప్పీ'

Wednesday,April 17,2019 - 11:48 by Z_CLU

‘ఆర్‌ఎక్స్‌100’ ఫేం కార్తికేయ నటిస్తున్న  ‘హిప్పీ` షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్  జరుగుతుంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 7న గ్రాండ్ గా విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

తమిళ్ & తెలుగు భాషల్లో సైమల్టియస్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జే.డీ.చక్రవర్తి  క్రూషియల్‌ రోల్ లో కనిపించనున్నాడు.  ఈ క్యారెక్టర్  సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు టిఎన్‌ కృష్ణ దర్శకుడు. దిగాంగన సుర్యవంసి కార్తికేయ సరసన హీరోయిన్ గా నటించింది.