అదితి రావ్ హైదరి ఇంటర్వ్యూ

Wednesday,June 13,2018 - 05:35 by Z_CLU

ఈ నెల 15 న రిలీజవుతుంది ‘సమ్మోహనం’ సినిమా. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావ్ హైదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ హీరోయిన్, ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చాలా విషయాలు చెప్పుకుంది. అవి మీకోసం…

సినిమాలో నా క్యారెక్టర్

నేనో పెద్ద స్టార్ లా కనిపిస్తాను ఈ సినిమాలో. తెలుగు సినిమాలు చేసే నార్త్ ఇండియన్ అమ్మాయి. చాలా హార్డ్ వర్కర్. మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటుంది…

అదే నిజం…

సినిమాలో స్టార్ లైఫ్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. నిజానికి యాక్టర్ లైఫ్ ఎప్పుడూ ఆన్ మోడ్ లోనే ఉంటుంది. జనాలు ఎప్పుడూ వాళ్ళ పర్ఫామెన్స్ గురించి మాట్లాడతారు, ఎక్కడ కనిపించిన నోటీస్ చేస్తారు.. జడ్జ్ చేస్తుంటారు… చివరికి జస్ట్ గ్లామరే కదా అనుకుంటారు… కానీ అలా కాదు…

చాలా కష్టపడతాం…

స్క్రీన్ పై ఎంత గ్లామరస్ గా కనిపించినా నిజానికి మేము చాలా కష్టపడతాం. ఆ విషయం అందరికీ తెలీదు. ఈ సినిమా చేశాక నేను చాలా విషయాల్లో రియలైజ్ అయ్యాను…

నేనసలు స్టోరీ వినలేదు…

ఇంద్రగంటి గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను పద్మావత్, భూమి సినిమాలతో బిజీగా ఉన్నాను. కనీసం స్టోరీస్ వినే టైం కూడా నా దగ్గర లేదు.

అలా జరిగింది…

ఆ తరవాత డైరెక్టర్ గారు జస్ట్ 5 లైన్స్ లో స్టోరీ చెప్తాను అన్నారు. ఆ 5 లైన్స్ వినగానే నాకు మొత్తం స్టోరీ వినాలనిపించింది. ఇక స్టోరీ విన్నాక నేను రిక్వెస్ట్ చేసుకున్నా.. ఈ సినిమా నేనెలాగైనా చేయాలి కానీ నా దగ్గర డేట్స్ లేవు. ప్లీజ్ నాకోసం వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాను.

నేనలా ఆలోచిస్తా…

నేనే సినిమా చేసినా నా ట్యాలెంట్ సినిమాకి ఏదోలా ఆడ్ అవ్వాలి అనుకుంటా… నటిగా నేను పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న స్టోరీస్ కే ప్రిఫరెన్స్ ఇస్తాను.

 

సైలెంట్ గా ఉంటాడు…

నాకు సుధీర్ బాబు గురించి ఈ సినిమాకి ముందు పెద్దగా తెలీదు. హిందీ మూవీ ‘బాగి’ లో చేశాడు అని విన్నాను అంతే. ఆయన సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటాడు, కెమెరా స్విచ్చాన్ అవ్వగానే ఆక్టివ్ అయిపోతాడు…

అవి నా తప్పులే…

నేను పుట్టింది హైదరాబాదే అయినా పెరిగింది ముంబైలో కాబట్టి తెలుగు రాదు. ఇంద్రగంటి గారి సపోర్ట్ తో డబ్బింగ్ చెప్పాను. అందునా సినిమాలో హీరోయిన్ రోల్ నార్త్ ఇండియన్ కాబట్టి మ్యాచ్ అయింది. డబ్బింగ్ విషయంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి నా మిస్టేక్సే…

నేను పక్కా హైదరాబాదీ…

నాకు తెలుగు రాకపోయినా నేను పుట్టింది హైదరాబాదే కాబట్టి నేను పక్కా హైదరాబాదీనే. నన్ను నా పేరెంట్స్ అలాగే పెంచారు.

నేనిష్టపడితే అంతే…

నాకు నచ్చిన క్యారెక్టర్ దొరికితే ఎంతైనా కష్టపడతా… ఇప్పుడు కూడా ఓ వైపు సంకల్ప్ రెడ్డి సినిమాలో రోప్స్ షాట్స్ కి ట్రైనింగ్ తీసుకుంటున్నా.. నైట్స్ లో మణిరత్నం గారి సినిమాలో నటిస్తున్నా… ఒకరకంగా చెప్పాలంటే నా డేట్స్ పరంగా సమ్మోహనం కూడా కుదిరేది కాదు.. కానీ స్టోరీ నచ్చింది కాబట్టే మ్యానేజ్ చేస్తూ కష్టపడ్డాను…

 

ఫేవరేట్ డైరెక్టర్స్…

మణిరత్నం, శేఖర్ కమ్ముల, మిష్కిన్, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజు, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్ తో పని చేయాలని  ఉంది.