మరో హారర్ థ్రిల్లర్ లో నయనతార

Wednesday,June 13,2018 - 07:29 by Z_CLU

కోలీవుడ్ లో నయనతారకు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఆమెకు అక్కడ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. హీరోతో సంబంధం లేకుండా ఆమె నటించే సినిమాలకు కాసుల వర్షం కురుస్తుంది. రీసెంట్ గా ఆమె చేసిన అరమ్ (తెలుగులో కర్తవ్యం) సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ బ్యూటీ మరో సినిమా స్టార్ట్ చేసింది.

ఇప్పటికే మాయ, డోర లాంటి హారర్-థ్రిల్లర్ సినిమాల్లో నటించిన నయనతార.. ఇప్పుడు అదే జానర్ లో మరో సినిమా చేస్తోంది. నిన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కేజేఆర్ స్టుడియోస్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాకు సర్జున్ దర్శకుడు. గతంలో మణిరత్నం, మురుగదాస్ లాంటి దర్శకుల వద్ద దర్శకత్వ విభాగంలో వర్క్ చేశాడు సర్జున్.

నిన్న ప్రారంభమైన ఈ సినిమాతో నయనతార లిస్ట్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల నంబర్ 5కు చేరింది. వీటిలో అజిత్, చిరంజీవి, శివకార్తికేయన్ లాంటి హీరోల సినిమాలతో పాటు తను లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీస్ కూడా ఉన్నాయి.