రామకృష్ణ, మోనికా ఇంటర్వ్యూ

Wednesday,December 12,2018 - 03:39 by Z_CLU

డిసెంబర్ 21 న రిలీజవుతుంది వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’. సినిమాలో ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో పాటు, అంతరిక్షాన్ని ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు తెలుగు ఆడియెన్స్.

అయితే సినిమాలోని CG వర్క్ తో పాటు, రియలిస్టిక్ అనిపించే ఆర్ట్ వర్క్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనికా ల ఇంటర్వ్యూ మీకోసం…

ఛాలెంజింగ్ సబ్జెక్ట్

‘అంతరిక్షం’ లాంటి సినిమా చేయాలి అనే ఆలోచన దగ్గరి నుండి, ఇలాంటి చాలెంజింగ్ సినిమా నిర్మించాలి అని ప్రొడ్యూసర్స్ అనుకోవడం నిజంగా గ్రేట్.

అలా బిగిన్ అయ్యాం…  

నాకు సంకల్ప్ స్టోరీ చెప్పలేదు, స్టోరీ బోర్డ్ చూపించాడు. తను రీసర్చ్ చేసిన పాయింట్ దగ్గరి నుండి ఏం చెప్దామనుకున్నాడనేది ఎక్స్ ప్లేన్ చేశాడు.

అదే కష్టం…

సాధారణంగా ఏ ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమానైనా మన ఇమాజినేషన్ మేరకు అద్భుతంగా ప్రెజెంట్ చేయడానికి చాన్స్ ఉంటుంది. కానీ సైన్స్ ఫిక్షన్ లో ఉండదు. ఇప్పుడు రాకెట్ అని చెప్పి, మనకు ఇష్టం వచ్చిన సెట్ వేయడానికి ఉండదు, న్యాచురల్ గా ఉండాలి, దాంతో పాటు షూటింగ్ చేసుకోవడానికి అంతే ఈజీగా ఉండాలి, ఈ ప్రాసెస్ లో కథలో ఉండే సీన్స్ ని మైండ్ లో పెట్టుకుని సెట్ వేసుకోవాలి.

సినిమా మొత్తం…

మ్యాగ్జిమం సినిమా సెట్ లోనే ఉంటుంది. కొన్ని పర్టికులర్ సీన్స్ రామేశ్వరం లో తెరకెక్కించడం జరిగింది.

నో రిఫరెన్స్…

మేము ఇంతవరకు చేసిన ఏ సినిమాకి కూడా రిఫరెన్సెస్ తీసుకోలేదు. ఈ సినిమాకి కూడా అంతే. కాకపోతే ప్రతి సినిమాకి, సబ్జెక్ట్ కి తగ్గట్టు రీసర్చ్ చేస్తాం. గతంలో ‘రంగస్థలం’ సినిమాకి చేశాం. ఈ సినిమాకి కూడా చేశాం.

NTR’ మిస్సయింది…

NTR సినిమాకి కూడా మేమే చేయాలి. ఫస్ట్ షెడ్యూల్, ‘దాన వీర శూర కర్ణ’ ఎపిసోడ్ కి సెట్ వేసింది మేమే అయితే, ఆ తరవాత ఈ సినిమా విషయంలో జరిగిన చేంజెస్, ఈ లోపు మేము వేరే సినిమాలకు కూడా కమిట్ అయి ఉండటంతో, ఆ సినిమా చేయలేకపోయాం.

సెట్స్ – సెక్షన్స్…

2 సాటిలైట్స్, స్పేస్ షిప్స్ అందులో 3 వర్కింగ్ సెక్షన్స్, స్పేస్ లాంచింగ్… ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతి దానికి డిఫెరెంట్ సెట్స్ వేశాం.

‘రంగస్థలం’ సినిమాకి తరవాతే…

‘రంగస్థలం’ సినిమా మా కరియర్ లో 18 వ సినిమా. కానీ ఎప్పుడూ అంతగా గుర్తింపు రాలేదు. ‘రంగస్థలం’ తరవాతే మమ్మల్ని గుర్తించారు. చాలా కాన్ఫిడెన్స్ ని తెచ్చిపెట్టిందీ సినిమా.

అంత టైమ్ దొరకలేదు…

మాకు ఫ్యామిలీలోనే కొంతమంది సైంటిస్ట్ లు ఉన్నారు. దాంతో పాటు ‘నాసా’ వాళ్ళతో మాట్లాడి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడం జరిగింది. ఆ ప్లేసెస్ కి వెళ్ళి రీసర్చ్ చేసేంత టైమ్ మాకు దొరకలేదు. ఇంటర్నెట్ లో కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది.

అదే అవార్డు…

మేం చేసిన సినిమా రిలీజైన తరవాత ఎవరైనా ఫోన్ చేసి, సెట్స్ చాలా బావున్నాయి అంటే అదే పెద్ద అవార్డు అనిపిస్తుంది. రీసెంట్ గా చిరంజీవి గారు, సుకుమార్ గారు మా పనిని అప్రీషియేట్ నిజంగా చాలా హ్యాప్పీ.

రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది…  

గుర్తింపు అంతగా రాకపోవడం అనేది కాస్త పక్కన పెడితే, ‘రంగస్థలం’ సినిమాకి ముందు చేసిన సినిమాలకు కూడా మేము అంటే కష్టపడ్డాం. అయితే రంగస్థలం తరవాత నుండి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది.

మాధవన్ సినిమాకి…

‘సవ్యసాచి’ సినిమాకి సెట్ వేసినప్పుడు మాధవన్ గారు, పిలిచి మరీ హగ్ చేసుకుని అప్రీషియేట్ చేశారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ‘రాకెట్రీ’ కి కూడా పని చేస్తున్నాం. ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్, తమిళంలో రిలీజవుతుంది. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

నెక్స్ట్ సినిమాలు…

మేము వర్క్ చేసిన ‘యాత్ర’ నెక్స్ట్ ఇయర్ రిలీజవుతుంది. రానా ‘హిరణ్య’ మూవీకి చేస్తున్నాం. సుకుమార్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సినిమాకి కూడా చేస్తున్నాం.