Aditi Rao Hydari - తెలుగు నేర్చుకుంటున్నాను

Monday,September 07,2020 - 10:44 by Z_CLU

* మా ఫ్యామిలీలో అందరూ తెలుగు మాట్లాడుతారు. కానీ నేను మాట్లాడలేను. చాలా తక్కువగానే మాట్లాడుతాను. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నేను తెలుగు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాను.
క్లాసులకు అటెండ్‌ అయ్యాను. అదే సమయంలో తమిళం నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాను. కానీ కన్‌ఫ్యూజన క్రియేట్‌ కావడంతో ఆపేశాను. నెక్ట్స్‌ తెలుగు సినిమా చేసే సమయంలో తెలుగు
ట్యూటర్‌ను పెట్టుకుని నేర్చుకుంటాను. అంతే కాదు.. నాతో మాట్లాడేవారిని తెలుగులోనే మాట్లాడమని చెబుతుంటాను. తెలుగు మీద చాలా ఆసక్తి ఉంది. ఈ కారణంగా సమ్మోహనం, వి చిత్రాలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.

* లాక్‌ డౌన్‌ సమయంలో ఇంకా ఓపికగా ఉండటం, దయగా ఇంకా ఎంత బాగా మెలగాలి.. అనే విషయాలను నేర్చుకున్నాను. దేనికీ ఎంత ప్రాధాన్యమివ్వాలనే విషయాలను నేర్చుకున్నాను. పాజిటివ్‌గా ఉండటం నేర్చుకున్నాను.

* జాన్‌ అబ్రహంతో సినిమా చేస్తున్నాను. ముంబైలో షూటింగ్‌లోనూ పాల్గొన్నాను. హీరో, నిర్మాతలు కరోనా వైరస్‌ వల్ల ఎలాంటి ఎఫెక్ట్‌ ఉంటుందనే విషయాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం వల్ల సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేశాం.

* ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నేను యాక్ట్‌ చేయడం లేదు. కానీ ప్రేక్షకులు నేను ఆ సినిమా చేస్తున్నారని అనుకుంటున్నారు.

* రెండు తమిళ చిత్రాలు, మూడు హిందీ చిత్రాలు, ఓ తెలుగు చిత్రం చేస్తున్నాను. వెబ్‌ సిరీస్‌లో నటించడం లేదు.