రజినీకాంత్ కొత్త సినిమాకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్

Thursday,March 01,2018 - 06:29 by Z_CLU

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరక్కనుంది రజినీకాంత్ కొత్త సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో కన్ఫం చేశాడు అనిరుద్.

రీసెంట్ గా పవన్ కళ్యాన్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకి సంగీతం అందించిన అనిరుద్ టాప్ మోస్ట్ స్టార్స్ కి ఫేవరేట్ మ్యూజిక్ కంపోజర్ అనిపించుకున్నాడు. యూత్ ఫుల్ ట్యూన్స్ తో ఎట్రాక్ట్ చేసే అనిరుద్ ఇప్పుడు రజినీకాంత్ సినిమాకి కూడా అంతే ఫ్రెష్ ట్యూన్స్ ని కంపోజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు.

 

గతంలో ‘పిజ్జా’ లాంటి హారర్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో రజినీకాంత్ ని సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నాడు. ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ పై  తెరకెక్కుతుంది.