రజినీకాంత్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్..?

Tuesday,June 19,2018 - 07:18 by Z_CLU

రజినీకాంత్ కొత్త సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటూనే మరో వైపు సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే అటు రవితేజ ‘తెరి’ రీమేక్ తో పాటు, క్వీన్ రీమేక్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న కాజల్, ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు రజినీకాంత్ హీరోయిన్ గా మెస్మరైజ్ చేయనుందా లేకపోతే ఈ టాక్ జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.