సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు పేరు...

Tuesday,August 07,2018 - 02:45 by Z_CLU

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇంకా రివీల్ కాలేదు. ఫస్ట్ లుక్ అంతకన్నా రివీల్ అవ్వలేదు. ఈ నెల 9 న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా జరుగుతున్న కౌంట్ డౌన్ లో భాగంగా జస్ట్ సినిమాలో మహేష్ బాబు పేరు రివీల్ చేసింది సినిమా యూనిట్. అంతే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘కౌంట్ డౌన్ ఫర్ ఫస్ట్ లుక్’ క్యాంపేన్ లో భాగంగా ‘రిషి’ అనే పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఫిలిమ్ మేకర్స్. దాంతో సోషల్ మీడియాలో ఈ పేరు చుట్టూ భారీ డిస్కర్షన్ బిగిన్ అయింది. జస్ట్ పేరు రివీల్ చేసినందుకే ఫ్యాన్స్ లో ఈ రేంజ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయంటే, ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ కోసం న్యూయార్క్ బయలుదేరనుంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. దిల్ రాజు, PVP తో పాటు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. వంశీ పైడిపల్లి డైరెక్టర్.