అఖిల్ సినిమాకు రెహ్మాన్ సంగీతం 

Friday,November 25,2016 - 10:40 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ రెండో సినిమాకు భారీ ఏర్పాట్లే చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాగ్… ఈమధ్యే హీరోయిన్ ఎంపిక కూడా పూర్తిచేశాడు. కోలీవుడ్ బ్యూటీ మేఘ ఆకాష్ ను అఖిల్ రెండో సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చైతు కు రెండు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన రెహమాన్… అఖిల్ కి కూడా సూపర్ హిట్ ఆల్బమ్ అందిస్తాడని నాగ్ నమ్మకంగా ఉన్నాడు.

      నాగార్జున, నాగచైతన్య సినిమాలకు సంగీతం అందించిన రెహ్మాన్.. ఇప్పుడు అఖిల్ సినిమాకు కూడా మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. డిసెంబర్ లో ప్రారంభంకానున్న ఈ సినిమా అఖిల్ పెళ్లి తరువాతే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.