జీ సినిమాలు (నవంబర్ 25th)

Thursday,November 24,2016 - 08:27 by Z_CLU

prathidwani

నటీ నటులు : ఊర్వశి శారద, అర్జున్, రజని

ఇతర నటీ నటులు : శరత్ బాబు, అల్లు రామలింగయ్య, గొల్లపూడి, పి. ఎల్. నారాయణ, రావు గోపాల రావు, నూతన్ ప్రసాద్, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : B. గోపాల్

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 మే 1986

తన భర్తను చంపిన హంతకులను ఒక లేడీ ఆఫీసర్ పట్టుకుని చట్టానికి అప్పగించడం కథాంశంగా తెరకెక్కిందే ప్రతిధ్వని. డైరెక్టర్ B. గోపాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన సినిమా ఇది. ఈ సినిమాలో ఊర్వశి శారద తన కరియర్ లోనే ఫస్ట్ టైం పోలీసాఫీసర్ గా నటించింది. ‘రాజకీయం’ అనే పదానికి కొత్త అర్థం చెప్తూ అలరించే పొట్టి సీతయ్య పాత్ర ఈ సినిమాకి హైలెట్. ఈ పాత్రను పరుచూరి గోపాలకృష్ణ పోషించారు.

——————————————————————

pachani-kapuram

నటీనటులు : సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి

ఇతర నటీనటులు : జగ్గయ్య, కాంతారావు, P.R. వరలక్ష్మి, విజయలక్ష్మి, బిందు మాధవి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : T. రామారావు

ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 7 సెప్టెంబర్ 1985

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పచ్చని కాపురం. ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువ జంట, కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోతారు. వారిద్దరూ మళ్ళీ కలుసుకునే క్రమంలో క్రియేట్ అయ్యే ఇమోషనల్ సన్నివేశాలు సినిమాలు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు.

——————————————————————

kshetram

నటీ నటులు : జగపతి బాబు, ప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

——————————————————————

nenu-meeku-telusa

నటీ నటులు : మంచు మనోజ్ స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : రియా సేన్, నాజర్, సునీల్, ఉత్తేజ్, బ్రహ్మానందం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చు & ధరన్

డైరెక్టర్ : అజయ్ శాస్త్రి

ప్రొడ్యూసర్ : లక్ష్మి మంచు

రిలీజ్ డేట్ : 2008

మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘నేను మీకు తెలుసా..?’ ఒక ఆక్సిడెంట్ లో తండ్రిని కోల్పోయిన ఆదిత్య తన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం షార్ట్ టైం మెమొరీ పేషెంట్ లా మారతాడు. తన రెగ్యులర్ ఆక్టివిటీస్ మర్చిపోకుండా ఉండటం కోసం, ఒక ఆడియో క్యాసెట్ లో ఎప్పటికపుడు రికార్డు చేసుకునే ఆదిత్య లైఫ్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. అసలు తనకు జరిగింది ఆక్సిడెంటా..? లేక హత్యా ప్రయత్నమా..? అనే అంశాలతో ముదిపడిందే ఈ సినిమా. షార్ట్ టైం మెమొరీ పేషెంట్ గా మనోజ్ నటన ఈ సినిమాలో హైలెట్.

——————————————————————

bava

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు ZEE Cinemalu లో చూడాల్సిందే.

——————————————————————

anasuya

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.