విదేశాల్లో ప్రభాస్ సినిమా....

Friday,November 25,2016 - 11:54 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘బాహుబలి-2’ షూటింగ్ దాదాపు పూర్తి కావడం తో తన నెక్స్ట్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోయే ఈ సినిమా యాక్షన్ ఎడ్వెంచర్ గా తెరకెక్కనుందని సమాచారం.

  ఈ సినిమా దాదాపు 70 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉండబోతుందట. ఇప్పటికే దుబాయ్ మరియు ఇతర ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చెయ్యడానికి రెడీ అయిన యూనిట్ ఆ ప్రదేశాల్లో షూటింగ్ పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అంతే కాదు ఈ సినిమాకు హాలీవుడ్ టాప్ యాక్షన్ స్టంట్ మాస్టర్స్ పనిచేయనున్నారని టాక్. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయట. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి నుండి ప్రారంభం కానుందని సమాచారం.