మార్చ్ 25న వస్తోన్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

Thursday,March 12,2020 - 12:40 by Z_CLU

యాంకర్ ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?. ప్రదీప్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా.. మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఎస్.వి.బాబు నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేయబోతున్నారు.

హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ .. ఇది నా ఫస్ట్ మూవీ. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నాకి థాంక్స్. తెలుగులో నా ఫెవరేట్ హీరో అల్లు అర్జున్. వారి సంస్థ జిఏ2 ద్వారా ఈ సినిమా మార్చ్ 25న విడులవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.” అన్నారు.

దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. “యంసిఏ చదివే రోజుల్లో సుకుమార్ వద్ద పనిచేయాలని గట్టిగా అనుకున్నాను. అలాగే సుకుమార్ గారి వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశాను. ఈ కథ అల్లు అర్జున్ గారికి, బన్నీ వాసుకి చెప్పాను. ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని సజేషన్స్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు చేశాం.” అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. “మంచి సాంగ్స్ చేయడానికి సిచ్యువేషన్ చెప్పి మంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు మున్నా. మ్యూజిక్ హిట్ అయింది. నిర్మాత బాబు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు..” అన్నారు.

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. నీలి నీలి పాటకు ఇప్పటికే 70మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇంకా 100 మిలియన్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో హీరోలు మహేష్, రానా… హీరోయిన్స్ కాజల్, తమన్నా అందరూ మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మున్నా మంచి కథ ఇవ్వడమే కాకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి మంచి టీమ్ కుదిరింది.” అన్నారు