Weekend Release - ఈ వారం సినిమాలు

Thursday,January 28,2021 - 08:30 by Z_CLU

ఈ వీకెండ్ 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో పెద్ద సినిమాలు లేకపోయినా అందర్నీ ఎట్రాక్ట్ చేసే సినిమా మాత్రం ఒకటి ఉంది. ఆ మూవీతో పాటు టోటల్ వీకెండ్ రిలీజెస్ చెక్ చేద్దాం

30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా. బుల్లితెర స్టార్ ప్రదీప్, ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమాతోనే ఓ మోస్తరు సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ హీరో. మూవీకి సంబంధించి ఓ సాంగ్ సూపర్ సెన్సేషనల్ హిట్టయింది. దీంతో పాటు మిగతా సాంగ్స్ కూడా క్లిక్ అవ్వడంతో ‘30 Rojullo Preminchadam Ela‘ సినిమాపై అంచనాలు పెరిగాయి. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో మున్నా దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

అన్నపూర్ణమ్మగారి మనవడు
సీనియర్ నటి అన్నపూర్ణ లీడ్ రోల్ పోషించిన సినిమా ఇది. కథ కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో అన్నపూర్ణమ్మ లీడ్ రోల్ గా వస్తున్న మొదటి సినిమా ఇదే. బాలాదిత్య, అర్చన హీరోహీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి మేటి హీరోయిన్ జమున, ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

జై సేన
సముద్ర డైరక్ట్ చేసిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. యూత్, రొమాంటిక్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేస్తూ.. రైతుల సమస్యల్ని ఇందులో సీరియస్ గా చర్చించారు. కాలేజీలో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేసే కుర్రాళ్లు.. తమ గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చలించిపోయి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఈ సినిమా స్టోరీ. సునీల్ పోలీసాఫీసర్ గా నటించిన జై సేన సినిమాలో సందర్భానికి తగ్గట్టు శ్రీకాంత్, తారకరత్న, శ్రీరామ్ లాంటి హీరోలు కనిపిస్తారు.

kalaposhakulu-cheppina-evvaru-nammaru

ఈ సినిమాలతో పాటు ‘చెప్పినా ఎవ్వరూ నమ్మరు‘, కళాపోషకులు, మిస్టర్ అండ్ మిస్ సినిమాలు కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న థియేటర్లలోకి ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.