30రోజుల్లో ... రిలీజ్ డేట్ ఫిక్స్ !

Monday,January 11,2021 - 03:15 by Z_CLU

యాంకర్ ప్రదీప్ హీరోగా మారి చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?’ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గతేడాది మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెలలో థియేటర్స్ లోకి రాబోతుంది. జనవరి 29 న సినిమా విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ సినిమా ఆల్బంలో ‘నీలి నీలి ఆకాశం’ అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఒకరకంగా సినిమాపై బజ్ తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేసింది. అందుకే ‘పాట అంత బాగుంటుంది సినిమా’ అంటూ రిలీజ్ పోస్టర్ పై ప్రచారం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా విజయంపైనే ప్రదీప్ యాక్టింగ్ కెరీర్ ఆధారపడి ఉంది. మరి హీరోగా ప్రదీప్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.