అల్లుడు అదుర్స్ కదా!

Thursday,March 12,2020 - 12:32 by Z_CLU

అల్లుడు శీను అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆ సినిమా హిట్. ఇప్పుడు మరోసారి అల్లుడు సెంటిమెంట్ కొనసాగించాడు ఈ హీరో. తన అప్ కమింగ్ మూవీకి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ పెట్టాడు. కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు ఈ టైటిల్ తో మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు.

పనిలోపనిగా మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రాబోతున్నాడు ఈ నయా అల్లుడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రమణ్యం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

మూవీకి సంబంధించి ఇప్పటికే జానర్ ఏంటనేది చెప్పేశాడు బెల్లంకొండ. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది అల్లుడు అదుర్స్ మూవీ. సినిమాలో బెల్లంకొండ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.