జీ సినిమాలు ( 20th ఏప్రిల్ )

Thursday,April 19,2018 - 10:03 by Z_CLU

భలే దొంగలు

నటీనటులు – తరుణ్, ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

==============================================================================

 

నాగవల్లి

నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్

డైరెక్టర్ : P.   వాసు

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010

విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

భగీరథ

నటీనటులు : రవితేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

=============================================================================

 

మహానంది 

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

 

రామయ్యా వస్తావయ్యా

నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, తనికెళ్ళ భరణి

సంగీతం : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

నిర్మాత : దిల్ రాజు

జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

 

భయ్యా

నటీనటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.