బన్ని కరియర్ లో ఫస్ట్ టైమ్ - ఏడాది మిస్సింగ్

Wednesday,October 23,2019 - 09:02 by Z_CLU

కుదరాలి కానీ ఏడాదికి రెండేసి సినిమాలు కూడా వెనకాడని బన్ని, తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఓ ఏడాది మిస్సయ్యాడు. ‘నా పేరు సూర్య’ తరవాత సెట్స్ పైకి రావడానికి తీసుకున్న చిన్న గ్యాప్ బన్ని ఫిల్మోగ్రఫీ లో 2019 మిస్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది బన్ని సినిమా రిలీజ్ కాలేదు.

2003 లో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన బన్ని ప్రతి ఏడాది మినిమం ఒక్క సినిమా అయినా ఉండేలా గ్రాఫ్ మెయిన్ టైన్ చేశాడు. కానీ కొన్నాళ్ళుగా స్ట్రాటజీ మార్చాడు. ఎన్ని సినిమాలు చేశాం అనే కన్నా, ఎలాంటి సినిమా చేశాం అన్నదానిపైనే ఫోకస్ పెట్టాడు.

‘నా పేరు సూర్య’ విషయంలో కరియర్ లోనే ఎన్నడూ లేని విధంగా ప్రిపేర్ అయ్యాడు బన్ని. కంప్లీట్ గా  తనను తాను మిలిటరీ ఆఫీసర్ గా ట్రాన్స్ ఫామ్ చేసుకున్నాడు. ఆ స్ట్రగుల్ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా తర్వాత చేయాల్సిన ‘అల..’ విషయంలో కూడా చాలా రోజులు డిస్కర్షన్స్ జరిపాడు. దాంతో న్యాచురల్ గానే గ్యాప్ క్రియేట్ అయింది.

ఓ ఏడాది మిస్సయిందని లెక్కలు వేసుకుంటే తెలుస్తుంది కానీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ‘అల..’ ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోయింది. మొన్నటికి మొన్న రిలీజయిన ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమనా’ బ్లాక్ బస్టర్ అవ్వడం, దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ‘రాములో రాములా..’ టీజర్ ఫ్యాన్స్ ని టోటల్ గా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సినిమాకి క్రియేట్ అవుతున్న క్రేజ్ చూస్తుంటే సినిమా రిలీజ్ సంక్రాంతికే అయినా ఇయర్ ఎండ్ నుండే బన్ని మానియా బిగిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.