బన్ని విషయంలో స్టైల్ మార్చని త్రివిక్రమ్

Friday,November 15,2019 - 09:03 by Z_CLU

త్రివిక్రమ్ కథల్లో గ్రాండియర్ ఉంటుంది. హీరోలను చాలా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు. వీలైనంత వరకు హీరో చుట్టూ ఉండే సీనియర్ క్యారెక్టర్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేస్తాడు. అది ఒక్కోసారి అత్త కావచ్చు.. నానమ్మ కావచ్చు.. నాన్న కావచ్చు. ఏదైనా కథని బట్టి ఫిక్సవుతాడు. కానీ బన్ని విషయంలో మాత్రం కథ ఏదైనా ఓ పర్టికులర్ ఎలిమెంట్ మార్చట్లేదు.. అదే నాన్న క్యారెక్టర్…

జులాయి :  గంటల్లో లక్షలు సంపాదించాలనుకునే చిన్న సైజు జులాయి క్యారెక్టర్ హీరోది. కానీ అసలు కథ మొదలయ్యేది తండ్రి డబ్బులు ఇచ్చిన తరవాతే… అక్కడి నుండే కథలో కావాల్సిన మలుపులు.. సినిమా చివర్లో కూడా తండ్రి చెప్పే నీతితోనే కథ ముగుస్తుంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో ‘జులాయి’ సినిమాలో బని క్యారెక్టర్ తరవాత అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ తండ్రిదే…

S/O సత్యమూర్తి : పెద్దగా న్యారేషన్ అవసరం లేదు. పక్కా ఫాదర్ సెంట్రిక్ సినిమా. తన తండ్రి మంచోడు అని ఒక్కరు కాదు… 100 మంది అనుకోవాలి. హీరో తనకెదురైనా ఏ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసినా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నిర్ణయాలు తీసుకుంటాడు…

అల.. వైకుంఠపురం లో…: ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా ఫాదర్ క్యారెక్టర్ కే ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ… ఈ రోజు రిలీజైన OMGDaddy ని బట్టి చూస్తే, ఇంచు మించి ఇలాంటిదేదో ఉండబోతుందనే అనిపిస్తుంది. ఈ విషయం అవునో కాదో సినిమా రిలీజైతే కన్ఫమ్ అవుతుంది.

చూడాలి.. త్రివిక్రమ్ ఈసారి కూడా కలిసొచ్చిన ఫాదర్ సెంటిమెంట్ తోనే బన్ని కోసం కథ రాసుకున్నాడా…? సినిమాలో టాబూ ఉంది కాబట్టి, ఈ క్యారెక్టర్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి… చూడాలి ఈ స్పెక్యులేషన్స్ ఎంతవరకు మ్యాచ్ అవుతాయో…