అల... టీజర్ – స్టైల్ గా ఉంది

Wednesday,December 11,2019 - 04:23 by Z_CLU

అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ టీజర్ రిలీజయింది. బన్ని.. త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి తగ్గ అవుట్ పుట్ అనిపించుకుంటుంది. భారీ క్యూరియాసిటీ మధ్య రిలీజైన ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

బన్ని స్టైలిష్ అవతార్… టీజర్ లో మోస్ట్ మెస్మరైజింగ్ ఎలిమెంట్ అయితే, మేకర్స్ ఈ టీజర్ ని ప్రెజెంట్ చేసిన పద్దతి జస్ట్ అవుట్ స్టాండింగ్. ఇకపోతే త్రివిక్రమ్ ఫ్యాన్స్ కోసం ‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా..’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

జస్ట్ టీజర్ కే తమన్ BGM ఇలా ఉంటే.. ఇక సినిమాలో ఎలా ఉండబోతుందో అనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో జెనెరేట్ అవుతుంది. ఇకపోతే ‘వైకుంఠపురా’నికి హీరోకి ఉన్న సంబంధం ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచిన మేకర్స్, ఈ టీజర్ లో సినిమా ఎంత స్టైలిష్ గా ఉండబోతుందన్నది మచ్చుకి ప్రెజెంట్ చేశారు.

త్రివిక్రమ్ ఈ సినిమాకి డైరెక్టర్. సీనియర్ హీరోయిన్ టాబూ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక & హాసినీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.