ఈ విషయంలో ‘సరిలేరు’ వేరు...

Wednesday,November 27,2019 - 09:02 by Z_CLU

అల్లు అర్జున్ ‘అల’ సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సంక్రాంతికి రిలీజవుతున్న ఈ సినిమాని పాటలతో మ్యాగ్జిమం స్థాయిలో రీచ్ అయ్యేలా చేస్తున్నారు మేకర్స్. ఎప్పటికప్పుడు సాంగ్ టీజర్ అంటూ మొదట్లో బజ్ క్రియేట్ చేసి, చిన్న గ్యాప్ లో కంప్లీట్ సాంగ్ రిలీజ్ చేస్తూ, అంచనాలని పెంచేస్తున్నారు. అయితే ఈ విషయంలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వేరు.

ఆలు అర్జున్ సినిమాకి, మహేష్ బాబు సినిమాకి జస్ట్ ఒక్కరోజు గ్యాప్ మాత్రమే. అయితే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో వైబ్స్ క్రియేట్ చేసిన మేకర్స్, సాంగ్స్ రిలీజ్ విషయంలో ఇప్పటి వరకు డెసిషన్ తీసుకోలేదు.

మహేష్ బాబు, DSP కాంబినేషన్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఓ వైపు బన్ని ‘అల’ నుండి రిలీజైన ప్రతి సాంగ్ సక్సెస్ అయింది. దాంతో న్యాచురల్ గానే ‘సరిలేరు’ సాంగ్స్ ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో జెనెరేట్ అవుతుంది.

‘అల’ నుండి వరసగా సాంగ్స్ రిలీజవుతుంటే ‘సరిలేరు’ నుండి ఒక్క సాంగ్స్ ని మినహాయించి మిగతా ఆక్టివిటీస్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. చూడాలి మరీ.. ఈ వరసలో సాంగ్స్ ని ఎప్పుడు రిలేజ్ చేసే ఆలోచనలో ఉన్నారో మేకర్స్.