దీపావళి కానుకగా రిలీజ్ కానున్న 2.0 ట్రైలర్

Thursday,October 25,2018 - 03:14 by Z_CLU

ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచనున్న ఫిల్మ్ మేకర్స్, దీపావళి కానుకగా నవంబర్ 3 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

చెన్నైలోని సత్యం సినిమాస్ లో ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. హాలీవుడ్ స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, అంతే గ్రాండియర్ గా డాల్బి అట్మాస్ 4D సౌండ్ టెక్నాలజీ లో రిలీజ్ అవుతుంది 2.0 ట్రైలర్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఫ్యాన్స్ లో సినిమాపై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్, ఈ ట్రైలర్ తో మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్నారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. S. శంకర్ ఈ సినిమాకి డైరక్టర్.