మరికొన్ని గంటల్లో 2.0 ట్రైలర్

Friday,November 02,2018 - 12:15 by Z_CLU

సోషల్ మీడియాలో 2.0 ఫీవర్ మరింత రేజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా అందరి ఫోకస్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ట్రైలర్ పైనే ఉంది. సోషల్ మీడియాతో పాటు, భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజవుతున్న ఈ ట్రైలర్, సినిమా స్టాండర్డ్స్ ని మరింత ఎలివేట్ చేయనుంది.

భారీ స్థాయి టెక్నికల్ ఎలిమెంట్స్ తో పాటు ఇంటర్నల్ గా మరో ఇమోషనల్ స్టోరీ కూడా 2.0 లో ఉండబోతుందని కన్ఫమ్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఈ ట్రైలర్ లో మరిన్ని ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ని రివీల్ చేస్తారనే ఎక్స్ పెక్టేషన్స్ ఫ్యాన్స్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ తరవాత మరింత అగ్రెసివ్ గా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని ప్రమోట్ చేయనున్నారు మేకర్స్.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది 2.0 సినిమా. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు, సినిమా రిలీజ్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో మేకర్స్, సినిమాని వరల్డ్ వైడ్ గా నవంబర్ 29 న రిలీజ్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్.